కృష్ణా జిల్లా నూజివీడులో తొలి కరోనా మరణం నమోదయ్యింది. టూరిస్ట్ గైడ్ గా పని చేస్తూ ఉపాధి పొందిన ఓ వ్యక్తి కరోనా పాజిటివ్ తో గత అర్ధరాత్రి మృతి చెందాడు. అతను భక్తులను పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రల దర్శనాలకు తీసుకు వెళ్లేవాడు. పట్టణంలోని పొట్టిశ్రీరాములు విగ్రహం దగ్గరలోని ఒక ప్రైవేట్ వస్త్ర దుకాణం వద్ద నివాసం ఉన్నాడు.
అతని మృతితో ఆ ప్రాంతంలో రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. మృతదేహం వద్దకు ఏ ఒక్కరినీ అనుమతించడం లేదు.మున్సిపల్ కమిషనర్ నేపా వాసు బాబు, మండల తాసిల్దార్ ఎం.సురేష్ కుమార్ ల పర్యవేక్షణలో ఆ ప్రాంతమంతా క్రిమి సంహారక మందులు పిచికారీ చేయించారు. ప్రజలను అప్రమత్తం చేశారు.
ఇవీ చదవండి: