ETV Bharat / state

ఆర్టీసీలో పదోన్నతులపై ఆర్థికశాఖ అభ్యంతరం

కొత్త పీఆర్సీ అమలుతో జీతాలు పెరుగుతాయని ఎదురుచూస్తున్న ప్రజా రవాణాశాఖ (ఆర్టీసీ) ఉద్యోగులకు మరికొన్నాళ్లు నిరీక్షణ తప్పకపోవచ్చు. పీటీడీలో కొంతకాలంగా ఇచ్చిన పదోన్నతులపై ఆర్థికశాఖ అభ్యంతరం చెప్పడంతో ఈ అంశం కొలిక్కి వచ్చేవరకు పాత జీతాలే ఇవ్వనున్నారు.

RTC
RTC
author img

By

Published : Aug 20, 2022, 9:21 AM IST

కొత్త పీఆర్సీ అమలుతో జీతాలు పెరుగుతాయని ఎదురుచూస్తున్న ప్రజా రవాణాశాఖ (ఆర్టీసీ) ఉద్యోగులకు మరికొన్నాళ్లు నిరీక్షణ తప్పకపోవచ్చు. పీటీడీలో కొంతకాలంగా ఇచ్చిన పదోన్నతులపై ఆర్థికశాఖ అభ్యంతరం చెప్పడంతో.. ఈ అంశం కొలిక్కి వచ్చేవరకు పాత జీతాలే ఇవ్వనున్నారు. ఈ మేరకు బిల్లులు సిద్ధం చేయాలంటూ అన్ని జిల్లాలకు పీటీడీ అధికారులు ఆదేశాలు పంపారు. పీటీడీ ఉద్యోగులకు జూన్‌ నుంచి పీఆర్సీ అమలు చేస్తూ, అదే నెల 3న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయినాసరే వివిధ కారణాలతో జూన్‌, జులైల్లో కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించలేదు. ఆగస్టుకు సంబంధించి సెప్టెంబరు ఒకటిన కొత్త పీఆర్సీతో జీతాలు ఇవ్వనున్నట్లు మూడు రోజుల కిందట ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో స్వయంగా ప్రకటించారు. కానీ ఆర్థికశాఖ కొర్రీల నేపథ్యంలో ఆ పరిస్థితిలేదని తేలిపోయింది.

పదోన్నతుల పేచీ..

‘ఆర్టీసీ ఉద్యోగులు పీటీడీలో విలీనమైనప్పటి నుంచి 40 మంది అధికారులు, 1,500 మంది వివిధ కేడర్ల ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చారు. ఆర్టీసీ బోర్డులో ఆమోదం తీసుకొని, ఖాళీలున్న మేరకు పదోన్నతులు కల్పించారు. అయితే దీనిపై ఆర్థికశాఖ తాజాగా అభ్యంతరం చెబుతోంది. ‘వారికి పదోన్నతులు ఎలా ఇచ్చారు? ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా? పదోన్నతులు పొందినవారికి కొత్త కేడర్‌తో పీఆర్సీ జీతాలు ఇవ్వడం సాధ్యంకాదు. ఆయా ఉద్యోగులకు పాత కేడర్‌ ప్రకారం బేసిక్‌, ఇతర భత్యాలు చూపిస్తేనే జీతాలు ఇస్తాం’ అంటూ ఆర్థికశాఖ స్పష్టం చేసింది. అలాచేస్తే పదోన్నతులు పొందిన ఉద్యోగుల జీతాలు తగ్గిపోనున్నాయి. దీంతో ఇప్పటికే ఇచ్చిన పదోన్నతులకు ఆమోదం తెలిపి, వాటిని క్రమబద్ధీకరించాలని కోరుతూ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శికి ఆర్టీసీ ఎండీ తాజాగా లేఖ రాశారు.

ఆర్టీసీ ఉద్యోగులు 2020 జనవరి నుంచి ప్రభుత్వంలో విలీనమవ్వగా.. వారికి ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల కేడర్లు, పేస్కేల్స్‌ ఖరారుచేస్తూ ఈ ఏడాది జూన్‌లో ఉత్తర్వులిచ్చారు. ఇలా రెండున్నరేళ్లు జాప్యం చేశారని, ఇంతకాలం ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకుండా ఎలా ఉంటామని ఆర్టీసీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలు, డిపోల వారీగా ఉన్న పోస్టుల మేరకే పదోన్నతులు ఇచ్చామని చెబుతున్నారు. ఆర్థికశాఖ అభ్యంతరం చెప్పడంపై సీఎంవో దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇవన్నీ కొలిక్కి వచ్చాకే కొత్త పీఆర్సీతో జీతాలు అందించే అవకాశం ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

ఇవి చదవండి: Affidavit on AP financial calculations సర్కారు లెక్కల్లో మాయాజాలం

వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడి అనుమానాస్పద మృతి,కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.