ETV Bharat / state

కరోనా బాధితులకు రైతు సంఘాల సహాయం - విజయవాడలో కరోనా బాధితులకు రైతు సంఘాలు సహాయం

కరోనా బారిన పడిన వారిని ఆదుకునేందుకు రైతు సంఘాలు తమ వంతు కృషి చేస్తున్నాయి. విజయవాడలోని అమరావతి ఆర్గానిక్స్‌, భారతీయ కిసాన్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు పండ్లను అందజేస్తున్నాయి. ఇటు రైతులను కూడా ఆదుకుంటూ అండగా నిలుస్తున్నాయి.

farmer associations distributes fruits to corona affected people at vijayawada
కరోనా బాధితులకు రైతు సంఘాలు సహాయం
author img

By

Published : Apr 7, 2020, 12:40 PM IST

కరోనా బాధితులకు రైతు సంఘాలు సహాయం

కొవిడ్‌ 19 బాధితులను ఆదుకునేందుకు రైతు సంఘాలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. విజయవాడలోని అమరావతి ఆర్గానిక్స్‌, భారతీయ కిసాన్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. లాక్‌ డౌన్‌ కారణంగా ఉద్యాన పంటల రైతులు పంటలు అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉండగా... వారికి అండగా ఉంటూ పంటలను కొని, విజయవాడలోని కోవిడ్‌ 19 బాధితులకు ఉచితంగా పంచిపెట్టేందుకు శ్రీకారం చుట్టారు. ఉద్యానవన శాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరి చేతుల మీదుగా... విజయవాడ సీవీఆర్‌ మున్సిపల్‌ పాఠశాలలో సుమారు 500మందికి ఆశ్రయం కల్పించి అరటి పండ్లను పంపిణీ చేశారు. అటు రైతులను, ఇటు అన్నార్తులను ఆదుకోవటమే తమ లక్ష్యంగా పనిచేస్తున్న అమరావతి ఆర్గానిక్స్​ను ప్రశంసించారు. పరిస్థితులు చక్కబడేవరకూ ఈ సహాయాన్ని కొనసాగిస్తామని అమరావతి ఆర్గానిక్స్‌ డైరక్టర్‌ ముత్తవరపు మురళీకృష్ణ చెప్పారు.

ఇదీ చదవండి:

'పేదలకు నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.