తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ తీవ్ర అల్పపీడనం రాత్రికి వాయుగుండంగా బలపడనున్నట్లు తెలిపారు. దీంతో 3 రోజుల పాటు కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించారు. ఈ వాయుగుండం 48 గంటల్లో ఒడిశా వైపు పయనించనున్నట్లు వివరించారు. ఆదివారం అక్కడక్కడా అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. తీరం వెంట గంటకు 50-60 కి.మీ. వేగంతో గాలులు వీచనుండటంతో ఈనెల 27న మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల శాఖ హెచ్చరించింది.
ఇదీ చదవండి: Health Commissioner: ఆస్పత్రుల్లో ఔషధాల కొరత లేదు: వైద్యారోగ్యశాఖ కమిషనర్