కృష్ణాజిల్లా విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి పర్యటించారు. రాణిగారితోట, భూపేష్ గుప్తానగర్, బాలాజీనగర్ కాలనీల్లో బాధితులను పరామర్శించారు. కరకట్టపై రిటర్నింగ్ వాల్ నిర్మించి వరదల నుంచి కాపాడాలని స్థానికులు మంత్రిని కోరారు. స్థానిక సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. నిరుపేదలందరికి ఇళ్లపట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం చౌకధరల డిపోల్లో నిత్యావసర వస్తువులను వరద బాధితులకు పంపిణీ చేశారు.
ఇదీచూడండి.వరదలు ప్రకృతి వైపరీత్యం కాదు...ప్రభుత్వ వైపరీత్యం : చంద్రబాబు