ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలను ఆదుకుంటామని హామీ ఇచ్చి... మోసం చేశారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మత్స్యకారులకు అరకొరా నిధులిచ్చి చేతులు దులుపుకోవాలని ప్రయత్నించటం దుర్మార్గమని మండిపడ్డారు. తెదేపా హాయాంలో మత్స్యకారులను ఆదుకున్నామని వివరించారు. వారికోసం బడ్జెట్లో రూ.339 కోట్లు కేటాయించిన గుర్తుచేశారు.
ఇదీ చదవండి: మత్స్యరంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపిన ఘనత మాదే