మద్యపాన నిషేధాన్ని అంచలంచెలుగా అమలు చేస్తామన్న జగన్ ప్రభుత్వం హామీ... మాటలకే పరిమితమైందని మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి విమర్శించారు. దశల వారీగా మద్యం దుకాణాలను ఎత్తివేస్తాం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు పేద కుటుంబాలను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కిస్తామన్న మాటలు నీటిమూటలయ్యాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. మద్యం అమ్మకాలు ప్రారంభమైన దగ్గరి నుంచి కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని ఆరోపించారు.
ఇదీ చదవండి: 'కరోనా సామాజిక వ్యాప్తి చెందింది.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి'