ETV Bharat / state

బ్యాంకుల ఎదుట చెత్త వేయడంపై విచారణ

బ్యాంకుల ముందు చెత్తవేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో రాష్ట్రప్రభుత్వం హడావుడిగా విచారణ ప్రారంభించింది. పురపాలక శాఖలోని ప్రాంతీయ సంచాలకుడి స్థాయి అధికారిని నియమించి విచారణ చేపట్టింది. సీసీటీవీ ఫుటేజీ సహాయంతో ఆధారాలు సేకరిస్తోంది. అటు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌.. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.

బ్యాంకుల ఎదుట చెత్త వేయడంపై విచారణ
బ్యాంకుల ఎదుట చెత్త వేయడంపై విచారణ
author img

By

Published : Dec 27, 2020, 4:28 AM IST

ప్రభుత్వ రంగ బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై బ్యాంకర్లు, ఆర్థిక నిపుణులు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేరుగా బ్యాంకుల ముందు చెత్తవేసిన చిత్రాలను ట్విటర్ లో పోస్టు చేసి రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితోనూ స్వయంగా మాట్లాడారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించినట్టు సమాచారం.

దేశవ్యాప్తంగా దుమారం రేగడంతో... ఈ ఘటనపై హడావుడిగా స్పందించిన రాష్ట్రప్రభుత్వం... విచారణను ప్రారంభించింది. పురపాలకశాఖ ప్రాంతీయ సంచాలకుడిని విచారణాధికారిగా నియమించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఉయ్యూరు, మచిలీపట్నం, విజయవాడలోని బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటనపై.. విచారణ చేపట్టారు. ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్‌తో పాటు పారిశుద్ధ్య సిబ్బంది, మెప్మా అధికారులను ప్రశ్నించారు. బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటనకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలుగా సీసీ కెమెరా ఫుటేజీని సేకరించారు. బ్యాంకర్లతోనూ మాట్లాడిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని విచారణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.

బ్యాంకుల ముందు చెత్త వేసింది ఎవరు, వేయించింది ఎవరన్న దానిపై.. అధికారులు విచారణ చేపడుతున్నప్పటికీ.. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికీ ఎలాంటి పోలీసు కేసూ నమోదు కాలేదు. రుణాలు ఇవ్వనందుకు నిరసనగా అంటూ.. ఉయ్యూరులో నగర పంచాయతీ కమిషనర్‌ పేరిటే బ్యాంకు గేటు వద్ద ప్లకార్డులు తగిలించడంపై బ్యాంకర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా ఓ ప్రభుత్వ శాఖే.. మరో కేంద్ర ప్రభుత్వ శాఖపై ఇలాంటి నిరసనలకు దిగటం సరికాదని...దీనిపై తీవ్రస్థాయిలో స్పందించేందుకు బ్యాంకర్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.