ETV Bharat / state

18 లక్షల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్​మీటర్లు.. ఏడాదిలోగా బిగింపు - విద్యుత్ సంస్కరణలు

smart meeters : రాష్ట్రంలో వ్యవసాయ పంపు సెట్ల బిగింపు ఏడాదిలోగా పూర్తి చేస్తామని ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్ తెలిపారు. మొత్తం 18 లక్షల మీటర్లు బిగించనున్నామని వెల్లడించారు. విద్యుత్ చౌర్యం అరికట్టేందుకు ఈ స్మార్ట్ మీటర్లు పెడుతున్నామని స్పష్టం చేశారు.

వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు
వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు
author img

By

Published : Mar 7, 2023, 8:12 PM IST

Smart meters to Agriculture : విద్యుత్ సంస్కరణల అమలులో భాగంగా.. రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో మీటర్లు బిగించగా విద్యుత్ వినియోగం గణనీయంగా ఆదా అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 18 లక్షల మీటర్లు బిగించనున్నామని, ఇందులో ఎలాంటి సందేహాలు లేవని ఇంధన శాఖ కార్యదర్శి కావేటి విజయానంద్ వెల్లడించారు. వ్యవసాయ ముసుగులో విద్యుత్ చౌర్యం అరికట్టేందుకు ఈ స్మార్ట్ మీటర్లు పెడుతున్నామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో వ్యవసాయ పంపు సెట్ల బిగింపు కార్యక్రమం ముందుకు సాగుతోందని, త్వరలోనే టెండర్లు పూర్తి చేసి ఏడాదిలోగా అన్ని కనెక్షన్లు ఇస్తామని ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్ స్పష్టం చేశారు. మొత్తం 18 లక్షల మీటర్లు బిగించనున్నామని, ఇందులో ఎలాంటి సందేహాలు లేవని ఆయన వెల్లడించారు. నెల వారీగా రైతులకు ఎంత సబ్సిడీ ఇస్తున్న అంశాన్ని తెలిపేందుకు స్మార్ట్ మీటర్లు పెడుతున్నామని వివరించారు. అగ్రికల్చర్ ఫీడర్​కు మీటర్లు పెట్టడం ద్వారా విద్యుత్ వినియోగం తెలియదని, వ్యవసాయ రంగం ముసుగులో విద్యుత్ చౌర్యం అరికట్టేందుకు ఈ స్మార్ట్ మీటర్లు పెడుతున్నామని స్పష్టం చేశారు.

విద్యుత్ సంస్కరణల అమలులో భాగంగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా ప్రతి 15 నిమిషాలకు డేటా వస్తుందని.. తద్వారా విద్యుత్ అదా చేయొచ్చని పేర్కొన్నారు. వ్యవసాయం, గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తామని చెప్పారు. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తే పాత మీటర్లు ఎందుకని ప్రశ్నించారు. లోడ్ అంచనా వేసి, రియల్ టైమ్​లో విద్యుత్ కొనుగోలు, విక్రయాలు చేయొచ్చని తెలిపారు. స్మార్ట్ మీటర్ల గురించి రైతులకు ఎలాంటి అనుమానాలు లేవని, కానీ ఇతరులకు ఎందుకు అనుమానాలు వస్తున్నాయని నిలదీశారు. ఇప్పటికే రైతుల నుంచి ఆమోద పత్రాలను తీసుకున్నామని, 16,55,988 మంది రైతులు స్మార్ట్ మీటర్లకు మద్దతు తెలిపారని వెల్లడించారు. స్మార్ట్ మీటర్ల బిగింపు వ్యయం ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు.

ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్

మీటర్లు పెట్టకముందు.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలో 25,524 కనెక్షన్లు ఉన్నాయి. నెలకు సగటున 8.46 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. అదే 2021-22 ఆర్థిక సంవత్సరంలో నెలకు విద్యుత్ వినియోగం సగటు గణాంకాలు 5.65 మిలియన్ యూనిట్లు మాత్రమే. రెండింటి మధ్య 2.81 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం తేడాను మనం గమనించవచ్చు. దీనిని పర్సంటేజీలో లెక్కిస్తే 33.24 శాతంగా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 83.16 శాతం స్మార్ట్ మీటర్లు పని చేస్తున్నాయి. - విజయానంద్, ఇంధన శాఖ కార్యదర్శి

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.