రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడ అజిత్ సింగ్ నగర్ కృష్ణా హోటల్ సెంటర్లో నిరసన తెలిపారు. యువత, పలువురు మోటారు రంగ కార్మికులు ప్లకార్డులు చేత పట్టుకొని ఆందోళన నిర్వహించారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. సూర్యారావు మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గుతుంటే మన దేశంలో 2 వారాల నుంచి ధరలు విపరీతంగా పెంచుతున్నారని విమర్శించారు. వెంటనే ధరలు తగ్గించకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.
ఇవీ చదవండి.. కొరవడిన పర్యవేక్షణ... నీరు వృథా..!