విజయవాడ కేంద్రంగా కొనసాగుతున్న డ్రగ్ దందా గుట్టురట్టయింది. సూడాన్‌కు చెందిన రసూల్, టాంజానియాకు చెందిన షబాన్ విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటూ మత్తుపదార్ధాల వ్యాపారం సాగిస్తున్నారు. దీనిపై నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వీరితో పాటు దిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన అర్జున్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఎండీఎంఏ అనే మత్తు పదార్ధాన్ని బెంగళూరులో కొని ఇక్కడ విక్రయించేందుకు తీసుకువచ్చినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుల నుంచి 17 గ్రాముల ఎండిఎంఏ, 150 గ్రాముల గంజాయిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకూ విజయవాడలో గంజాయి మాత్రమే విక్రయిస్తున్నారని భావించిన పోలీసులకు ఇప్పుడు ఎండిఎంఏ లాంటి మత్తుపదార్ధాలు దొరకటంతో నివ్వెరపోయారు. దీనిపై మరింత నిఘా పెడతామని చెప్పారు.
ఇవీ చదవండి..
విజయవాడలో కరోనా పరీక్షలు నిర్వహించే ట్రైఏజ్ కేంద్రం ప్రారంభం