ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ సంక్షేమ మండలి బోర్డు నిధులను ప్రభుత్వం ఇతర శాఖలకు మళ్లించడాన్ని ఖండించారు ఏపీ కార్పెంటర్స్ అసోసియేషన్ 13 జిల్లాల నాయకులు. కార్మికులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారి సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోగా సంక్షేమ బోర్డు నిధులను ఇతర శాఖలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ పాలసీల వలన నిర్మాణ రంగం కుదేలైపోయిందని విమర్శించారు. కరోనా ప్రభావంతో కార్మికులు మరింతగా కష్టాల్లో కూరుకుపోయారన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్మాణ రంగంపై ఆధారపడిన 40 రకాల వృత్తిదారులు రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు.లాక్ డౌన్ కాలానికి ప్రతి కార్మికునికి నెలకు 10 వేల ఆర్ధిక సాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: అవతార్.. ఇదో కొత్త బెట్టింగ్ దందా..!