ETV Bharat / state

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దుర్గామల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం - విజయవాడ ఇంద్రకీలాద్రి వార్తలు

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో చైత్రమాస వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారికి దివ్య కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. లాక్​డౌన్ కారణంగా ఈ వేడుకల్లో ఆలయ కమిటీ ప్రతినిధులు మాత్రమే పాల్గొన్నారు.

divya kalyanotsavam held at indrakiladri temple
ఇంద్రకీలాద్రిపై ఘనంగా దుర్గామల్లేశ్వరస్వామి దివ్య కల్యాణోత్సవం
author img

By

Published : Apr 7, 2020, 3:00 PM IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై చైత్రమాస వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా... గంగా సమేత దుర్గా మల్లేశ్వరస్వామి దివ్య కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. దేవస్థానం ఆశీర్వచన మండపంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎంవీ సురేష్ బాబు, పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు ఆధ్వర్యంలో ఈ వేడుకను పండితులు నిర్వహించారు. అమ్మవారికి ఆలయ ఈవో దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. లాక్‌డౌన్‌ దృష్ట్యా భక్తులు ఆలయానికి వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. ఆలయ కమిటీ ప్రతినిధులు మాత్రమే వేడుకకు హాజరయ్యారు.

ఇదీ చదవండి:

వైరస్​ నివారణకు శతచండీ ధన్వంతరి హోమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.