కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా లాక్డౌన్ కొనసాగుతున్నా.. అత్యవసరాల పరిధిలోకి వచ్చే పెట్రోల్ బంకులు 24 గంటలూ పనిచేస్తున్నాయి. బంకుల్లో పనిచేసే సిబ్బంది 3 షిఫ్టుల్లో విధులకు హాజరుకాక తప్పని పరిస్థితి. అనేక వాహనాల్లో పెట్రోల్ నింపుకునేందుకు బంకులకు వస్తుంటారు. అయితే వారిలో ఎవరికి ఏ లక్షణాలు ఉన్నాయో చెప్పలేని పరిస్థితి. ఈ క్రమంలో వినియోగదారుల నుంచి సిబ్బందికి, సిబ్బంది నుంచి వినియోగదారుల రక్షణ కోసం విజయవాడ నగరంలో పోలీసుల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు సిబ్బందికి రక్షణ కిట్లు అందించారు. తల నుంచి కాళ్ల వరకు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా రూపొందించిన ఈ కిట్ ధరించి.. విధులు నిర్వహిస్తున్నారు. నగరంలో రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భయం భయంగా విధులు నిర్వర్తించాల్సి వస్తుందని.. ఈ కిట్లు ధరించి ధైర్యంగా డ్యూటీ చేయగలుగుతున్నామని.. వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'రెడ్ జోన్లలో కచ్చింతంగా మాస్కులు వేసుకోవాలి'