ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న కొండపల్లి బొమ్మలకి మూలధారమైన పునికి చెట్లని తన సొంత బామ్మర్దితో కలిసి ఇష్టారీతిలో ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను బలి చేసి... తాను పారదర్శక పాలన చేస్తున్నానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
తెదేపా హయాంలో ఇచ్చిన పూరగుట్ట స్థలం విషయంలో తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని...అవసరమైతే కేసు కూడా పెట్టాలని దేవినేని సవాల్ విసిరారు. తాను చేసిన అభివృద్ధి ఏంటో నియోజకవర్గ ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే వ్యవహారిస్తున్న తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
ఇదీ చదవండి