పాలన చేతగాక సీఎం జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పారని తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమ విమర్శించారు. కృష్ణా జిల్లా పురగుట్టలో తెదేపా హయాంలో ఇచ్చిన పట్టాలను రద్దు చేసే అధికారం ఎవరిచ్చారని దేవినేని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన లే అవుట్‌కు వైకాపా పేర్లు పెట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. రైతుల సమస్య తీర్చమని వచ్చిన వారిపై నాయకులతో దాడి చేయించడం దారుణమన్నారు. రైతులపై దాడులు చేయడమే.. రాజన్న రాజ్యమా అని ప్రశ్నించారు. కడప జిల్లాలో సుబ్బయ్య హత్య సర్కర్ హత్యేనని ఆరోపించారు. సుబ్బయ్య హత్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: శ్రీశైలం సత్రం వద్ద ఘర్షణ...సీసీ కెమెరాలో దృశ్యాలు