ఉపాధి హామీ పథకంలో భాగంగా మండల కార్యాలయాల్లో పని చేస్తున్న ఎంసీసీ అటెండర్ల 8 నెలల పెండింగ్ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఉపాధి హామీ మండల ఎంసీసీ అటెండర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కాశింబీ డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో ప్రతి మండలంలో ఒక అటెండర్ పని చేస్తున్నారు. రోజు 14 గంటలు పని చేస్తున్న వీరికి ఇచ్చే వేతనం నెలకు రూ.6 వేలు మాత్రమే. అది కూడా 8 నెలలుగా ఇవ్వడం లేదు. తక్షణమే వారి వేతనాలను విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: