కృష్ణా జిల్లా చల్లపల్లిలో అర్హులందరికీ నివేశనా స్థలాలు ఇవ్వాలని, లాటరీ తీసిన లబ్ధిదారుల జాబితానే కొనసాగించాలని సీపీఎం నాయకులు యద్దనపూడి మధు, వెనిగళ్ల వసంతరావు, అన్నం గగారిన్ డిమాండ్ చేశారు. చల్లపల్లిలో నివేశనా స్థలాల లబ్ధిదారుల జాబితాలు గ్రామపంచాయతీలో ప్రచురించిన నేపథ్యంలో... జాబితాలో పేర్లు లేని వారు సోమవారం పెద్ద ఎత్తున స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు.
అన్ని అర్హతలు ఉన్నవారిని అనర్హులుగా నిర్ధరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత జాబితాను కొనసాగించాలని, ఇంకా అర్హులు ఉంటే వారికీ స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ కె.స్వర్ణమేరికి వినతిపత్రం అందచేశారు. ఇది చదవండి అక్రమ మద్యం పట్టివేత..నిందితులు అరెస్టు