విజయవాడ ప్రకాష్ నగర్ ప్రాంతంలో డ్రైనేజీలో ఓ ఎద్దు ప్రమాదవశాత్తు పడిపోగా, వెంటనే స్పందించిన పాయకపురం అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని తాళ్ల సాయంతో కాపాడారు. డ్రైనేజీ సుమారు ఆరు అడుగులపైగా లోతు ఉండటంతో ఎద్దు ప్రమాదవశాత్తు అటుగా వెలుతూ పడిపోయింది. స్థానికులు పైకి తీసే ప్రయత్నం చేయగా రాలేదు. పాయకాపురం అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం అందివ్వగా వారు వచ్చి ఎద్దును బయటకు తీశారు.
ఇది చదవండి 'హైకోర్టు తీర్పుతో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గెలిచింది'