కృష్ణాజిల్లా మచిలీపట్నం పరిధిలోని మూడు కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ విజయవంతంగా నిర్వహించారు. ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రి, బందర్ మండల పరిధిలోని ఎస్ఎన్ గొల్లపాలెంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
మూడు కేంద్రాలను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ సుహాసిని, మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి సందర్శించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండాడ్రై రన్ విజయవంతంగా నిర్వహించినట్లు వారు తెలిపారు.
ఇదీ చదవండి