ETV Bharat / state

కరోనా ప్రభావం.. నాగేంద్రుని ఆలయంలో భక్తుల రద్దీ - mopidevi temple news

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. కరోనా దృష్ట్యా నిబంధనలు కఠినతరం చేయడం వల్ల స్థానికంగా పల్లెల్లో ఉన్న నాగేంద్రుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. వృద్ధులు, పదేళ్లలోపు చిన్నారులకు ఆలయంలో అనుమతి లేకపోవడం వల్ల గంజివానిపాలెంలో నాగేంద్రస్వామి దర్శనం చేసుకోని తలనీలాలు సమర్పించుకుంటున్నారు.

Corona effect to divine vision at mopidevi village krishna district
గంజివానిపాలెంలో దర్శనం చేసుకుంటున్న భక్తులు
author img

By

Published : Jun 15, 2020, 12:19 AM IST

కరోనా ప్రభావంతో కృష్ణా జిల్లా మోపిదేవి మండలం శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి అధికారులు నిబంధనలు కఠినతరం చేశారు. ఆలయానికి వచ్చే ప్రతి భక్తుని ఆధార్​, ఇంటి నెంబర్​, ఫోన్​ నెంబర్​ను నమోదు చేసుకుంటున్నారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, పదేళ్లలోపు చిన్నారులను ఆలయంలోకి అనుమతించడం లేదు.

ఈ క్రమంలో భక్తులు స్థానికంగా ఉన్న గంజివానిపాలెంలో నాగేంద్ర స్వామి ఆలయం వద్ద పుట్టలో పాలు పోసి తలనీలాలు సమర్పించుకుంటున్నారు. కొంతమంది ఆధార్​ తీసుకు రాకపోవడం వల్ల స్వామిని దర్శించుకోలేక వెనుదిరుగుతున్నారు. కరోనాతో ఆలయానికి భక్తుల రద్దీ తగ్గింది.

ఇదీ చదవండి:

ఘనంగా ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.