ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్ : స్టీల్​, అల్యూమినియం పరిశ్రమలు డీలా - స్టీల్ అల్యూమినియం పరిశ్రమలపై లాక్​డౌన్​ ప్రభావం

ప్రతి ఒక్కరి జీవితంలో స్టీలు, అల్యూమినియం సామాన్లు ఓ భాగమనే చెప్పాలి. వంట వండాలన్నా... భోజనం చేయాలన్నా వీటిని విరివిరిగా వినియోగిస్తుంటారు. పెళ్లి, పేరటం, విందు వినోదం, శుభకార్యాలలో స్టీల్​ వస్తువులను బహుమతులుగా ఇవ్వడం పరిపాటి. లాక్​డౌన్​ ప్రభావంతో.. అల్యూమినియం, స్టీలు తయారీ పరిశ్రమలు కుదేలయ్యాయి. మళ్లీ ఎప్పుడు కోలుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొంది.

కరోనా ఎఫెక్ట్ : స్టీల్​, అల్యూమినియం పరిశ్రమలు డీలా

author img

By

Published : Jun 10, 2020, 6:56 PM IST

పెళ్లంటే నగలు, దుస్తులే కాదు.. కొత్తకాపురానికి అవసరమైన వంట సామగ్రి కూడా ముఖ్యమే. అటువంటి వస్తువులకు చిరునామా అల్యూమినియం, స్టీలు పరిశ్రమలు. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ఈ వస్తువుల తయారీ పరిశ్రమలు దాదాపు 100 వరకూ ఉన్నాయి. ఈ పరిశ్రమలపై ఆధారపడి దాదాపు 10 వేల మందికి పైగా జీవనం సాగిస్తున్నారు. లాక్​డౌన్​ కారణంగా మూడు నెలలపాటు ఈ పరిశ్రమలు మూతపడ్డాయి. సడలింపులతో తిరిగి తెరుచుకున్నా.. మార్కెట్ లేని కారణంగా ఉత్పత్తుల తయారీపై ప్రభావం పడింది.

కొనుగోళ్ల మందగమనం, సిబ్బంది కొరతతో.. ఉత్పత్తి కూడా నామమాత్రంగా నడుస్తోంది. ఉత్పత్తుల క్రయవిక్రయాలకు సంబంధించి మార్కెట్ ఇంకా తెరుచుకోకపోవటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. మార్కెట్ పుంజుకోవాలంటే ప్రజారవాణాతో పాటు ఇతర నిబంధనలు సడలించాల్సి ఉండటంతో నామమాత్రంగానే పరిశ్రమలు నడుస్తున్నాయి.

తెరుచుకున్న పరిశ్రమల్లోనూ 30 శాతం సిబ్బందే పనిచేస్తున్నారు. సిబ్బంది కొరతతో ఉత్పత్తులను సగం తగ్గించినట్లు పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. అల్యూమినియం ఉత్పత్తులకు డిసెంబర్ నుంచి జూన్ నెల వరకు సీజన్​ ఉంటుందని, కానీ ఈ ఏడాది లాక్​డౌన్​ వల్ల వ్యాపారం పూర్తిగా దెబ్బతిందని పారిశ్రామిక వేత్తలు వాపోతున్నారు. రవాణా లేకపోవటంతో.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ముడి సరకు కూడా రావటంలేదంటున్నారు.

అల్యూమినియం, స్టీల్​ పాత్రలు తేలికగా ఉండటంతోపాటు చౌకగా లభిస్తుంటాయి. తుప్పు సమస్య తక్కువగా ఉండటం, మన్నిక ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు వీటి వినియోగానికి మొగ్గుచూపుతుంటారు. కరోనా వల్ల గత 50 ఏళ్లలో ఎప్పుడూ చూడని సంక్షోభం తలెత్తిందని వ్యాపారులు దిగులు చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలు తమకు ప్రత్యక్షంగా ఉపకరించట్లేదని ఆవేదన చెందుతున్నారు.

2010 నుంచి చిన్న తరహా పరిశ్రమలు ఆటు పోట్లు ఎదుర్కొంటున్నా ఇంత తీవ్ర సంక్షోభం ఎప్పుడూ చూడలేదని పారిశ్రామిక వేత్తలు చెబుతున్నారు. సరళీకృత ఆర్థిక విధానాలు, జీఎస్టీ, నోట్ల రద్దు వంటి ప్రభావాలను తట్టుకుని నిలబడినా.... తాజా సంక్షోభం మాత్రం ఈ రంగాన్ని కుదేలు చేసిందని ఆవేదన చెందుతున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పునఃప్రారంభమైనా మార్కెట్ కష్టాలు, కార్మికుల కొరత, రవాణాలేమి ఇబ్బందులు వెంటాడుతూనే ఉన్నాయని వాపోతున్నారు.

కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ, రాయితీలు క్షేత్రస్థాయిలో అంత ఉపయోగకరంగా లేవన్నదే పారిశ్రామికవేత్తల వాదన. ఉద్యోగులకు పూర్తి స్థాయి జీతాలు చెల్లింపులు, పీఎఫ్ చెల్లింపు పరిధిలో ఎక్కువ పరిశ్రమలు రాకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.

ఇదీ చదవండి : గుండెపోటుతో తండ్రి మృతి.. ఆగిన కుమార్తె పెళ్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.