కరోనా మహమ్మారి పేదల బతుకులను కకావికలం చేసింది. రెక్కడితేగాని డొక్కాడని జీవితాలను ఛిద్రం చేసింది. ఉపాధి లేక పస్తులుండేలా చేసింది. కరోనా కారణంగా తమకు పూటగడవటం కష్టంగా ఉందని గుంటూరు జిల్లా సమ్మర్పేట, రామాంజనేయపేటకు చెందిన పలువురు కూలీలు వాపోతున్నారు. తిందామంటే తిండిలేక, బయటకెళితే పనిలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచదవండి