ETV Bharat / state

తాడేపల్లిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం - జిల్లాల్లో రాజ్యాంగ దినోత్సవం తాజా వార్తలు

తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, తితిదే ఛైర్మన్​తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పలు జిల్లాలో నేతలు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Constitution Day celebrations
తాడేపల్లిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
author img

By

Published : Nov 26, 2020, 3:34 PM IST

రాజ్యాంగం ప్రకారం న్యాయ, కార్యనిర్వహక, శాసన వ్యవస్థలు సక్రమంగా పనిచేయాల్సిన అవసరం ఉందని... తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుబ్బారెడ్డి.... అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. విద్య, వైద్యం అందరికి అందించాలనే అంబేద్కర్‌ ఆశయాన్ని సీఎం జగన్‌ నెరవేర్చుతున్నారని హోంమంత్రి సుచరిత అన్నారు. సమ సమాజ స్థాపన కోసం అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదని,ఆయన స్పూర్తితో అనగారిన వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని మంత్రులు కొనుయాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, శంకర నారాయణ, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి...

ముంబయి ఉగ్రదాడుల్లో అమరులకు నివాళులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.