కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ.. మానవహక్కుల కమిషన్ కు, రాష్ట్ర గవర్నర్ కు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిర్యాదు చేసింది. ఈ విషయాన్ని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాధ్ తెలిపారు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును కాలరాసేలా ప్రభుత్వాల తీరు ఉందని.. ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో కరోనా చావు కేకలు రోజు రోజుకూ మిన్నంటుతున్నాయని... సౌకర్యాలు మెరుగుపరచాల్సింది పోయి.. ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్.. ప్యాలస్ వీడి బయటకు వచ్చి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు పరిశీలించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: