విజయవాడలోని వార్డు సచివాలయాలను.. కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించారు. 'స్పందన'తో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజల నుంచి వస్తోన్న అర్జీలు.. వాటి పరిష్కారానికి ఉద్యోగులు చుపిస్తోన్న చొరవ గురించి ఆరా తీశారు. కరోనా కేసులు, అమ్మఒడి, విద్యా దీవెన, ఇళ్ల పట్టాలు, రేషన్‌కార్డుల దరఖాస్తులను గురించి వాలంటీర్లను అడిగి తెలుసుకున్నారు. మాస్కులు పెట్టుకోని సిబ్బందిని మందలించారు. సామాన్య జనానికి ఆదర్శంగా ఉండాలని సూచించారు.
నగరంలో రేపు జరుగనున్న సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. దుర్గామల్లేశ్వరస్వామి సిద్దార్ధ మహిళా కళాశాలను సందర్శించి.. సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్నారు. విజయవాడలోని 27 కేంద్రాల్లో 12,533 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. 54 మంది విభిన్న ప్రతిభావంతులకు బెంజి సర్కిల్ సమీపంలోని నారాయణ కళాశాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు రెండవ పేపరు పరీక్ష ఉంటుందని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: