ఉచిత ఇసుక సరఫరాపై... కృష్ణా జిల్లా విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ సమీక్ష నిర్వహించారు. తహశీల్దారుకు దరఖాస్తు చేసిన వారికి ఇసుక మంజూరు స్లిప్‌లు అందజేస్తున్నామన్నారు. 40 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను ప్రజలకు ఉచితంగా అందించినట్లు చెప్పారు. సెప్టెంబరు ఐదో తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక విధానం అమల్లోకి తేనుందని పేర్కొన్నారు. ఈలోగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా మినరల్ ఫండ్ నిధుల నుంచి రోడ్డు నిర్మాణ పనులు చేపడతామన్నారు.
ఇదీ చూడండి: రిజిస్ట్రేషన్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్