కృష్ణాజిల్లా వెంట్రప్రగడ గ్రామంలో పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. వెంట్రప్రగడలోని జిల్లా ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. పంచాయితీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించి.. ఎన్నికల అధికారి డేవిడ్ రత్నరాజుతో మాట్లాడారు.
పోలీసు ఉన్నతాధికారులతో శాంతి భద్రతలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పారపూడి ఎస్ఐ రాజేంద్రప్రసాద్ తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కృష్ణాలో ఏకగ్రీవ సర్పంచిలకు ధ్రువీకరణ పత్రాలు అందజేత