జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పలువురు కొవిడ్ బాధితులు, వారి కుటుంబ సభ్యులతో కలెక్టర్ ఇంతియాజ్ ఫోన్లో మాట్లాడారు. బాధితులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఆహార పదార్ధాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. కరోనా లక్షణాలు తగ్గినా ఆక్సిజన్ సామర్ధ్యం మెరుగుపడేందుకు చికిత్స పొందుతున్నట్లు వలువురు చెప్పారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు.
కరోనా రెండో దశ తీవ్ర ప్రభావం చూపుతున్నందున.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టరు కోరారు. కొవిడ్ నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి..