ETV Bharat / state

'ఆందోళన వద్దు.. కరోనా కట్టడికి విస్తృత చర్యలు' - విజయవాడ వార్తలు

జిల్లాలో కరోనా కట్టడికి అవలంబిస్తున్న చర్యలను కలెక్టర్​ ఇంతియాజ్.. సీఎస్​కు వివరించారు. వైరస్ బారిన పడిన వారు భయపడవలసిన అవసరం లేదన్నారు.

కలెక్టర్​ ఇంతియాజ్
కరోనా కట్టడి చర్యలు సీఎస్​కు వివరించిన కలెక్టర్
author img

By

Published : May 22, 2021, 11:39 AM IST

జిల్లాలోని కొవిడ్ పరిస్థితులను కలెక్టర్ ఇంతియాజ్.. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్​కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. ప్రైమరీ కాంటాక్టులుగా 2,71,830 మందిని, సెకండరీ కాంటాక్టులుగా 3,99,669 మందిని గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 11,225 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కలెక్టరు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. సర్పంచ్​లను, స్థానిక ప్రజాప్రతినిధులను చైతన్య పరచి వ్యాధి లక్షణాలు ఉన్నవారిని, అనుమానితులను సీసీసీలకు, ఆస్పత్రులకు సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఫీవర్ సర్వేలో భాగంగా 7,62,355 ఇళ్లను సర్వే చేసి కోవిడ్ లక్షణాలు ఉన్న 3,564 మంది గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరందరికీ ఆర్టీ పీసీఆర్ టెస్టుల నిర్వహణకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్.. సీఎస్​కు చెప్పారు.

జిల్లాలో మొత్తం 9,794 మంది హోమ్ ఐసోలేషన్​లో ఉండగా.. ఒక్కరోజే 671 మంది కొత్తగా హోమ్ ఐసోలేషన్​కు వెళ్లినట్లు కలెక్టర్​ వివరించారు. ఇప్పటి వరకు 9,017 మందికి కరోనా మందుల కిట్లు అందించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 77 కోవిడ్ ఆసుపత్రుల్లో.. 5,063 బెడ్లు ఉండగా.. 4,707 బెడ్లను చికిత్సకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఆక్సిజన్ బెడ్లు 825, నాన్ ఆక్సిజన్ 2,367, జనరల్ 1,871 ఉన్నాయన్నారు. జిల్లాలోని 7 కోవిడ్ కేర్ కేంద్రాల్లో 3,139 బెడ్లు అందుబాటులో ఉండగా.. వాటిలో సుమారు 291 మందికి వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి:

మధ్యప్రదేశ్​లో తొలి వైట్ ఫంగస్ కేసు

విజయవాడలో నూతన ఆక్సిజన్​ ప్లాంట్​కు శంకుస్థాపన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.