CM Jagan Promises Not Fulfilled for Small Industries: తియ్యని మాటలు, ఉత్త చేతులు. ఇది జగన్ బిల్డప్‌కు సరిగ్గా సరిపోయే ట్యాగ్ లైన్. పరిశ్రమలకు రీస్టార్ట్ ప్యాకేజ‌్ అంటూ (Ministry of Micro Small and Medium Enterprises) ఎంఎస్ఎంఈలను ఊరించిన జగన్ ఉసూరుమనిపించారు. ప్రభుత్వ శాఖల వస్తు సేకరణలో ఎంఎస్ఎంఈల నుంచి కొంత తప్పనిసరిగా సేకరించేలా ఉత్తర్వులిస్తామని నమ్మబలికిన జగన్ మూడేళ్లైనా అమలు చేయలేదు. చిన్న పరిశ్రమలు డీలా పడుతున్నా చేయూతనివ్వడం లేదు. 2020లో రీస్టార్ట్ ప్యాకేజీ అంటూ ఇలా ఉదరగొట్టారు సీఎం జగన్. ఈ మాట చెప్పి కూడా మూడేళ్లైంది. జగనన్న తియ్యటి మాటలు నమ్మి కొందరు చిన్నపరిశ్రమల యజమానులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి కంగుతిన్నారు. జగన్ చెప్పినట్లు తమ ఉత్పత్తులు తీసుకోవాలని అడిగారు. కానీ అధికారులు రివర్స్ గేర్ వేశారు. అసలు ప్రభుత్వం నుంచి అలాంటి అధికారిక ఆదేశాలు రాలేదని చెప్పేశారు. మరి చిన్నపరిశ్రమలపై జగన్ అంత ప్రేమ ఎందుకు ఒలకబోశారు. ఆయనంతే ఎన్నో చెప్తారు కానీ చెప్పినవేవీ చేయరు.
Government Not Support Loss of small industries: చిన్న పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా జిల్లా కలెక్టర్లు చేయూత ఇవ్వాలని నోటి మాటతో సరిపెట్టారు జగన్. కానీ అధికారులకు కావాల్సింది నోటిమాట కాదు కదా! నిర్దిష్ట ఉత్తర్వులుండాలి కదా. అందుకే అధికారులు చిన్న పరిశ్రమల కోసం వస్తు కొనుగోలు టెండరును విభజించడం సాధ్యం కాదన్నారు. ఒకప్రభుత్వ శాఖలో 100 కోట్ల రూపాయల విలువైన వస్తువుల కొనుగోలుకు టెండరు పిలిస్తే అందులో 25 శాతం చిన్న పరిశ్రమల కోసం విభజించి ప్రత్యేకంగా టెండరు పిలవడానికి ఆర్థిక శాఖ అంగీకరించదు. ఆర్థికశాఖ ఏదైనా ఉత్తర్వులిస్తే తప్ప అలా చిన్న పరిశ్రమల నుంచి కొనుగోళ్లకు ప్రత్యేక టెండర్ ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు తేల్చిచెప్పారు. ఈ విషయం సీఎం జగన్‌కు తెలియదంటారా. తెలియకేం ఆయనంతే తియ్యటి మాటలతో ఖుషీ చేస్తారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు జరిపే కొనుగోళ్ల పర్యవేక్షణకు ఒక పోర్టల్‌ను అందుబాటులోకి తేలేకపోయారు. ఇవేమీ లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం జెమ్ పోర్టల్ ద్వారా జరిపే కొనుగోళ్లపైనే రాష్ట్రంలోని చిన్న పరిశ్రమలూ ఆధారపడాల్సి వస్తోంది.
Industry Associations Concern Down Financial Difficulties: చిన్న పరిశ్రమలు ఉత్పత్తులు అమ్ముకోడానికి ప్రభుత్వ విభాగాలు పిలిచే టెండర్లలో పాల్గొనే అవకాశం ఉండటం లేదు. టెండరు విలువ ఎక్కువగా ఉండడం అందులో పేర్కొనే టర్నోవర్, గత అనుభవం, క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ వంటి నిబంధనలు భర్తీ చేయడం చిన్న పరిశ్రమలకు సాధ్యం కావడం లేదు. కార్పొరేట్ కంపెనీలే బిడ్లు వేసి పనులు ఎగరేసుకుపోతున్నాయి. వస్తు కొనుగోలుకు పిలిచే టెండర్లలో చిన్న కాంపోనెంట్‌లు చాలా ఉంటాయి. వాటిని వేరు చేసి ఎంఎస్ఎంఈలకు ఇవ్వడానికి అవకాశం ఉన్నా అధికారులు కార్పొరేట్ కంపెనీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రక్షణ రంగంలోనే ప్రిఫరెన్షియల్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ కింద విడిభాగాలను ఎంఎస్ఎంఈల నుంచి రక్షణ శాఖ తీసుకుంటోంది. అలాంటప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు జరిపే కొనుగోళ్లలో ఎందుకు ప్రాధాన్యత ఇవ్వరు. అందుకే సాధారణంగా చిన్న పరిశ్రమల సగటు జీవిత కాలం ఏడు సంవత్సరాలైతే ఆలోపే ఆర్థిక ఇబ్బందులతో మూతపడుతున్నాయని పరిశ్రమల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
జీన్స్ పరిశ్రమలపై విద్యుత్ ఛార్జీల బాదుడు - రాయితీలకూ నోచక మూతపడుతున్న పరిస్థితి
Private Sector MSME provide Employment To Youth: ప్రైవేటు రంగంలో యువతకు ఎక్కువ ఉపాధి కల్పించేది ఎంఎస్ఎంఈలే. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రెండున్నర లక్షల ఎంఎస్ఎంఈలు కొత్తగా ఏర్పాటయ్యాయని వాటి ద్వారా పదహారు లక్షల యాభైవేల మందికి ఉపాధి లభించిందని ప్రభుత్వమే చెబుతోంది. ఇంత మందికి ఉపాధి కల్పించే రంగాన్ని జగన్ మాటలతో మభ్యపెట్టడం సరైనదేనా. రాష్ట్రంలో సుమారు 8 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయని పరిశ్రమల శాఖ పేర్కొంది. జగనన్న బాదుడుకు వాటి పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచగా కార్మికుల కూలి రేట్లు, ముడిసరకు ధరలూ పెరుగుతూ వచ్చాయి. ఆ ప్రభావం ఉత్పత్తి వ్యయంపై పడింది.
నాలుగున్నరేళ్లలో 130 కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేశాం: సీఎం జగన్
Government Not Care Petition Documents: అధిక వస్తు ఉత్పత్తి చేసే కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడి మార్కెట్‌లో నిలదొక్కుకోవడం చిన్న పరిశ్రమలకు సాధ్యం కావడం లేదు. కనీసం ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేసే వస్తువుల్లో అన్నింటికి కలిపి ఒకే టెండరు కాకుండా ఎంఎస్ఎంఈలు సరఫరా చేయడానికి ఆస్కారం ఉన్న వాటికి ప్రత్యేకంగా టెండరు పిలిస్తే అవి ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని పలుమార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందించినా ఫలితం లేకుండా పోయింది. మన దగ్గర అందుబాటులో ఉన్న చిన్నచిన్న విడిభాగాలను సైతం ప్రభుత్వ శాఖలు ఇతర రాష్ట్రాల నుంచి కొంటున్నాయని వాపోతున్నారు. వైద్య, ఆరోగ్యశాఖనే తీసుకుంటే ఆ విభాగం ప్రొక్యూర్ చేసే వివిధ రకాల ఉత్పత్తులు, సిరంజిలు, ఫర్నిచర్ వంటివి చిన్న పరిశ్రమల నుంచి కొనుగోలు చేయాలని కోరుతున్నాయి.
నిరుద్యోగులకు హామీ ఇస్తున్నాం-పెద్దఎత్తున పరిశ్రమలు తెస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం: నారా లోకేశ్