తమను అధికారులు మోసం చేస్తున్నారని కృష్ణా జిల్లా డీలర్ల సంఘం అధ్యక్షుడు ముత్యాల శేషగిరిరావు ఆరోపించారు. గోనె సంచుల విషయంలో అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను ఖండిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు జగ్గయ్యపేట చౌక సరకుల గోదాము ఎదుట ఆందోళన నిర్వహించారు. జీఓ 10ని రద్దు చేసే వరకూ విధులు నిర్వహించలేమని స్పష్టం చేశారు. ఇంటింటికీ రేషన్ సరకులు సరఫరా చేయాలన్న నిర్ణయం నష్టం చేకూరుస్తుందని.. అయినా ఆశయం నచ్చి స్వాగతించామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'అన్నదాతలు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం'