విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో సీఐడీ అధికారులు తనిఖీలు చేశారు. 2015 తర్వాత ఆసుపత్రిలో కొనుగోలు చేసిన పరికరాల వివరాలపై ఆరా తీశారు. ప్రస్తుతం ఆ పరికరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. వాటి పనితీరు ఎలా ఉంది అనే విషయాలను ఆసుపత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. విశాఖ, విజయనగరం జిల్లాల్లో సైతం సోదాలు జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొనుగోలు చేసిన పరికరాల వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. ఇప్పటికే కర్నూలు, అనంతపూర్, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో తనిఖీలు చేసి వివరాలను సేకరించారు. సీఐడీ అధికారులు బృందాలుగా విడిపోయి ఐదురోజులుగా సోదాలు కొనసాగిస్తున్నారు.
ఇదీ చూడండి. అధిక వడ్డీ ఆశచూపి కోట్ల రూపాయలు కాజేసిన మోసగాళ్లు..!