అమరావతి విషయంపై జగన్ మెప్పు కోసం ఎన్జీవోలు కోర్టుకు వెళ్తామని అంటున్నారని తెదెపా పొలిట్ బ్యూరో సభ్యులు చినరాజప్ప విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్య విలువలు దిగజారిపోయాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించటానికే ప్రభుత్వాలు ఉండాలనీ... ఇది జగన్ ప్రభుత్వం తెలుసుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ అయిన జస్టిస్ రామకృష్ణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని ధ్వజమెత్తారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నా... సరిపడా కిట్లు లేవని కలెక్టరు, జేసీలు సీఎంకు విన్నవిస్తుంటే, ముఖ్యమంత్రి మాత్రం కరోనాతో సహజీవనం చేయండి అంటూ కరోనాను గాలికి వదిలేశారని మండిపడ్డారు. ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉన్నా, ముఖ్యమంత్రి పట్టించుకోలేని పరిస్థితి ఉందని చినరాజప్ప దయ్యబట్టారు.
ఇదీ చదవండి: కృష్ణా జిల్లాలోనే అధిక కరోనా పరీక్షలు: వెల్లంపల్లి