తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విశాఖలో తమ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, వెలగపూడి రామకృష్ణలపై కేసులు పెట్టారన్న ఆయన... అక్రమ కేసులు పెడితే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయా అంటూ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. ఇకనైనా రాజకీయ వేధింపులకు స్వస్తి చెప్పి పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు.
ఇసుక కొరత మరో అరాచకం
ప్రభుత్వం ఇసుక కొరత సృష్టించి పేదల పొట్టకొట్టడాన్ని నిరసిస్తూ... మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తోన్న 36 గంటల దీక్షను అడ్డుకోవడం మరో అరాచకమని మండిపడ్డారు. ప్రజాందోళనలు అణచి వేయడంపై పెట్టే శ్రద్ధలో పదో వంతు పేదల సమస్యల పరిష్కారంపై పెడితే ఈ దుస్థితి ఉండదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
విశాఖలో సమీక్ష
విశాఖలో గాజువాక, విశాఖ ఉత్తరం, భీమిలికి చెందిన పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధినేత అనుమతితో ఈ సమావేశానికి హాజరు కాలేదు.
ఇదీ చూడండి: