ETV Bharat / state

కష్టకాలంలో ప్రజలకు అండగా ఉందాం.. నేతలకు చంద్రబాబు పిలుపు - కరోనా పై చంద్రబాబు వ్యాఖ్యలు

కరోనా తీవ్రత గురించి ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా.. పట్టించుకోనందు వల్లే దేశంలో కరోనా విజృంభణలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వం ఎదురుదాడి చేసినా.. ప్రజల సమస్యల పరిష్కారమే ఎజెండాగా క్యాడర్ ముందుకు వెళ్లాలని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

chandrababu
chandrababu
author img

By

Published : Jul 28, 2020, 12:33 AM IST

కరోనా సమయంలోనూ.. ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగుతుండటం దుర్మార్గమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతలకు, కార్యకర్తలకు ట్విట్టర్ ద్వారా వీడియో సందేశాన్ని ఇచ్చారు. కరోనా వల్ల ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్న చంద్రబాబు.. ప్రజలకు జీవనోపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సరిగా వ్యవహరించని ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తత చేయడం ప్రతిపక్షంగా తమ బాధ్యతని స్పష్టం చేశారు. కరోనా తీవ్రతపై ఎన్నిసార్లు చెప్పినా.. ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోకపోవడం బాధేస్తోందన్నారు. ప్రతిపక్షం నేతల సలహాలు, సూచనలు పెడచెవిన పెట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చంద్రబాబు మండిపడ్డారు.

బంధువులు, కుటుంబ సభ్యులను చూసుకోలేని విపత్కర పరిస్థితుల్లో ఉన్నామని చంద్రబాబు గుర్తు చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అందరు మనోధైర్యంగా ఉండాలని సూచించారు. వర్చువల్ గా పనిని అలవాటు చేసుకుంటూ.. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం తప్పని సరిగా పాటించాలని కోరారు. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్లు ఎంతో సేవ చేస్తున్నారన్నారు. ప్రాణాలు కాపాడేందుకు వారు చేసే అత్యవసర సేవ వెలకట్టలేనిదని అభినందించారు. ఫ్రంట్ లైన్ వారియర్లు కొంతమంది చనిపోవడం బాధాకరమని, వారంతా కనిపించే దేవుళ్ళని అభివర్ణించారు. కనిపించని శత్రువు కరోనాపై పోరాడే వారందరికీ అభినందనలు తెలిపారు. జాతి వారి సేవలకు రుణపడి ఉంటుందన్నారు.

కుటుంబసభ్యులను లెక్క చేయకుండా.. ముందుకొచ్చి సేవలందిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్లకు గుర్తింపు లభించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అందరూ.. ధైర్యంగా ఉండి సమస్యను అర్ధం చేసుకుంటూ.. ఫ్రెంట్ లైన్ వారియర్స్ కు అండగా ఉండాలని క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. 16 డిమాండ్లతో 5రోజులుగా తెలుగుదేశం చేపట్టిన నిరసనలు ప్రశంసనీయమన్న చంద్రబాబు.. పార్టీ పిలుపు మేరకు తోచిన విధంగా సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో లక్ష దాటాయ్​.. వైరస్​తో 1,090 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.