కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ జరిగింది. ధూళిపాళ్ల నాగపద్మావతి అనే మహిళ పొలంలో గేదెలు మేపుతుండగా.. ఓ వ్యక్తి ఆమె మెడలో నుంచి ఉన్న 3కాసుల బంగారు ఆభరణాన్ని లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. చోరీకి గురైన బంగారం విలువ లక్షన్నర ఉంటుందని తెలిపారు.
మచిలీపట్టణం గొడుగుపేటలో..
మచిలీపట్టణం గొడుగుపేటలో ఇద్దరు చైన్‌స్నాచింగ్ దొంగలు చోరీకి పాల్పడ్డారు. స్థానికంగా నివసిస్తున్న త్రిపుర సుందరి అనే మహిళ మెడికల్ దుకాణానికి బయలుదేరింది. అంతలో ద్విచక్రవాహనంపై ఇద్దరు యువకులు వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇనుగుడూరుపేట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సీసీఫుటేజీల ఆధారంగా చోరీకి పాల్పడిన వారిని గుర్తించే పనిలో పడ్డారు.
విజయవాడ పటమట పీఎస్ పరిధిలో..
విజయవాడ పటమట పీఎస్ పరిధిలోని రామలింగేశ్వర నగర్లో గొలుసు దొంగతనం జరిగింది. శుభకార్యానికి నడిచి వెళుతున్న కృష్ణవేణి అనే మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లిపోయారు. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు అగంతకులు మహిళ మెడలో గొలుసు లాగే ప్రయత్నం చేయగా ఆమె ప్రతిఘటించింది. దాంతో గొలుసు ముక్కలైంది. మూడు కాసులు పైగా చోరీ అయిందని బాధితురాలు వివరించింది. సంఘటనా స్ధలానికి చేరుకొన్న పటమట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తుచేపట్టారు.
ఇదీ చదవండి: