ETV Bharat / state

ఓటరు జాబితా సవరణ షెడ్యూల్‌ విడుదల - voter list revision schedule

కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా సవరణ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆగస్టు 1వ తేదీ నుంచి నెలాఖరు వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల వివరాలను ఈసీ పరిశీలించనుంది. అనంతరం మార్పులు, చేర్పులతో 2020లో తుది ఓటర్ల జాబితాను ఈసీ ప్రకటిస్తుంది.

Central Election Commission announces voter list revision schedule
author img

By

Published : Aug 1, 2019, 10:56 AM IST

ఆంధ్రప్రదేశ్లోనూ ఓటరు జాబితా సవరణకు షెడ్యూలు విడుదలైంది. ఇందులో ముఖ్యమైన తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఆగస్టు 1 నుంచి 31 తేదీ వరకూ ఓటర్ల జాబితాను పరిశీలించి తనిఖీ కోసం సిద్ధం చేయనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకూ బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాను తనిఖీ చేయనున్నారు. సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 15 వరకూ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియను కూడా చేపట్టనున్నారు. అక్టోబర్ 15న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేయాలని, అనంతరం అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 వరకూ నెలన్నరపాటు అభ్యంతరాలను స్వీకరించాలని ఈసీ భావిస్తోంది. నవంబర్ 2, 3 తేదీల్లో ఓటర్ల నమోదు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని సైతం చేపట్టనున్నారు. వచ్చిన అభ్యంతరాలను డిసెంబర్ 15 నాటికల్లా పరిష్కరించి.. డిసెంబర్ 31లోగా మార్పులతో, కొత్తగా నమోదు చేసుకున్న వారి పేర్లు చేర్చి.. ఓటరు జాబితా ముద్రించాలని నిర్ణయించారు. 2020 జనవరిలో తుది జాబితా విడుదల చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో 3 కోట్ల 98 లక్షల మంది ఓటర్లు ఓటెయ్యగా, 10 లక్షల మంది కొత్తగా ఓటును నమోదు చేసుకున్నారు. 2018 అక్టోబరులో ముసాయిదా ప్రకటన చేసి, 2019 జనవరిలో ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించింది. అయితే అదే సమయంలో పెద్ద ఎత్తున ఫాం 7ల దరఖాస్తులు వెల్లువెత్తటంతో వాటి పరిశీలనను నిలిపివేసిన ఈసీ, యధాతథంగా ఓటర్ల జాబితాలో మార్పులు లేకుండానే ఎన్నికల నిర్వహణ చేపట్టింది. ప్రస్తుతం ఈ దరఖాస్తుల పరిశీలన చేసిన అనంతరం 2020లో తుది ఓటర్ల జాబితాను ఈసీ ప్రకటించనుంది.

ఇదీచూడండి.ప్రజా సమస్యలపై అధ్యయన కమిటీలు: పవన్

Intro:Ap_vja_11_26_RJV_gennverm_airport_av_C10
Sai babu_ Vijayawada: 9849803586
యాంకర్: లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత తో పాటు విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించడానికి బొంబాయి నుండి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పై మీడియా సమావేశం నిర్వహించడం పై పోలీసులు అడ్డుకుని రామ్ గోపాల్ వర్మ ని తిరిగి వెనక్కి పంపించినా సంఘటనపై నివేదిక స్పందించిన రాంగోపాల్ వర్మ సార్వత్రిక ఎన్నికల అనంతరం మళ్లీ తాను అదే చోట మీడియా సమావేశం నిర్వహిస్తామని విజయవాడ చేరుకున్నాడు. కాగా పోలీసులు అక్కడ నిర్వహించడం పై అభ్యంతరం వ్యక్తం చేసి వేరే చోటకు మార్చుకోమని తెలియజేయడంతో సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు..

Body:Ap_vja_11_26_RJV_gennverm_airport_av_C10

Conclusion:Ap_vja_11_26_RJV_gennverm_airport_av_C10
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.