అక్రమంగా రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్న వారి నుంచి డబ్బులు డిమాండ్ చేశారని 9 మందిపై ఆరోపణలు వచ్చాయి. తాము విలేకరులమంటూ డబ్బులు అడిగారని.. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు నందిగామ డీఎస్పీ తెలిపారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం అల్లూరు గ్రామం సమీపంలో ఈ సంఘటన జరిగింది.
పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఆటో డ్రైవర్ను రూ.యాభై వేలు ఇవ్వాలని బెదిరించినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. అతని దగ్గర ఉన్న రూ.ఐదు వేలు లాక్కున్నారని చెప్పారు. నిందితుల్లో 8 మందిని అరెస్ట్ చేశామని.. కోర్టులో హాజరుపరచనున్నామని డీఎస్పీ వెల్లడించారు. వారి నుంచి బుల్లెట్ వాహనం, చాకు, రూ.20,750 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారి గురించి తమకు సమాచారం అందించాలని కోరారు.
ఇదీ చదవండి: