ETV Bharat / state

టిక్​టాక్​ చేశాడు... క్వారంటైన్​కు వెళ్లాడు - మంచిర్యాలలో టిక్​టాక్ కేసు వార్తలు

లాక్​డౌన్​ పరిస్థితుల్లో పొరుగు రాష్ట్రంలో ఉన్నవారిని... ఎలాగోలా ఇంటికి చేరుకునే ఏర్పాట్లు చేసినప్పుడు ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటించాలి. కానీ ముంబయి నుంచి వచ్చిన ఓయువకుడికి హోంక్వారంటైన్​లో ఉండాలని అధికారులు చెప్పినా వినకుండా ఊళ్లో తిరుగుతూ టిక్​టాక్​ వీడియోలు చేశాడు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా ఇటిక్యాలకు చెందిన సాయికృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు.

tiktok video cas case registered   on home quarantine teenager made  tick talk video in telenganae
తెలంగాణలో హోంక్వారంటైన్​ యువకుడు టిక్​టాక్ వీడియో చేసినందుకుకేసు
author img

By

Published : May 19, 2020, 8:04 PM IST

తెలంగాణలో హోంక్వారంటైన్​ యువకుడు టిక్​టాక్ వీడియో చేసినందుకుకేసు

బాధ్యతలేని స్వేచ్ఛ.... సమాజానికి చేటు అనడానికి కొందరి ప్రవర్తన అతికినట్టు సరిపోతుంది. కరోనా విజృంభిస్తున్న సమయంలో పొరుగురాష్ట్రాల నుంచి వచ్చిన వారు కచ్చితంగా హోంక్వారంటైన్​లో ఉండాలని చెబుతున్నా... కొందరు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. గృహనిర్బంధంలో ఉండాల్సిన యువకుడు గ్రామంలో తిరుగుతూ టిక్​టాక్​వీడియోలు చేశాడు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం ఇటిక్యాలకు చెందిన సాయి కృష్ణ... ఈ నెల 14న ముంబయి నుంచి గ్రామానికి వచ్చాడు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పోలీస్, వైద్య సిబ్బంది సాయికృష్ణకు వైద్యపరీక్షలు చేసి గృహనిర్బంధంలో ఉండాలని ఆదేశించారు. అయినప్పటికీ ఇవేమీ తనకు పట్టనట్టు గ్రామంలో తిరుగుతూ టిక్​టాక్​ వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు యువకుడిపై సెక్షన్​188, 269 కింద కేసు నమోదు చేసి బెల్లంపల్లి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఏర్పాటుచేసిన క్వారంటైన్​ కేంద్రానికి తరలించారు.

ఇవీ చూడండి: రాష్ట్రానికి నీళ్లు తేకుండా కథలు చెబుతున్నారు: అయ్యన్నపాత్రుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.