కృష్ణా జిల్లా నందిగామ రథంబజార్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. కారు వెనుకకు రివర్స్ చేసే క్రమంలో.. పక్కనున్న హోటల్‌లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో హోటల్ ఫర్నిచర్, సామగ్రి, బైక్ ధ్వంసం అయ్యాయి. హోటల్‌లో పనిచేసే నలుగురు వ్యక్తులకు తృటిలో ప్రమాదం తప్పింది. అనుభవంలేని డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: