కృష్ణా జిల్లా గన్నవరం తహశీల్దార్ కార్యాలయం ప్రాంగణం వద్ద భవన నిర్మాణ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పని దినాలలో నష్టపోయిన కార్మికులకు ప్రభుత్వం 10 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 4 మాసాల తమ ఆకలి బాధకు భృతి ఇవ్వాలని... ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధి కల్పించాలని భవన నిర్మాణ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, సీఐటీయు నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: విజయవాడలో భవన కార్మికుల వినూత్న నిరసన