ఎంతోమంది విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే చదువుల ఒడి అది. అలాంటి చోట జరుగుతోన్న సంఘటనలు ఆందోళన కలిగించేలా ఉంటున్నాయి. విద్యార్థులు ఏమవుతారోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసే స్థాయికి దిగజారిపోతుంది నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్. తాజాగా బాలికల వసతిగృహంలో ఓ విద్యార్థి (బాలుడు) 11 గంటలు ఉండటం కలకలం సృష్టించింది.
సాధారణంగా విద్యార్థినుల వసతి గృహాలుండే చోట సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుంది. కానీ నూజివీడు ట్రిపుల్ ఐటీలో మాత్రం కిటికీ గ్రిల్స్ పగలగొట్టినా అక్కడి సిబ్బందికి వినిపించలేదు. ట్రిపుల్ ఐటీ గర్ల్స్ హాస్టల్లోకి అదే క్యాంపస్‌కు చెందిన ఓ విద్యార్థి (బాలుడు) ప్రవేశించాడు. తనకు తెలిసిన అమ్మాయి గదికి వెళ్లాడు. ఈ సినిమాకు మిగతా అమ్మాయిలు కూడా సహకరించినట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి ఎవరూ తీసుకెళ్లలేదు. ఎలాగోలా అధికారులకు సమాచారం అందింది. సిబ్బందికి విషయం తెలిసిన వెంటనే గునపాలతో ఆ గది వైపు వెళ్లి.. తాళం పగలగొట్టారు. తలుపు తెరవగానే గదిలో అమ్మాయి కనిపించింది. ఏంటి తల్లీ తాళం వేసిన గదిలో ఉన్నావు అని అడిగితే... ఆ విద్యార్థిని నుంచి సమాధానం లేదు. సెక్యూరిటీకి సిబ్బంది మంచాలను పక్కకు జరిపి చూడగా.. గదిలోని మంచం కింద ఉన్నాడో విద్యార్థి.
తర్వాతేం జరిగింది..?
యాజమాన్యం, సెక్యూరిటీ సిబ్బంది సంఘటన వివరాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. గునపాలతో తలుపులు పగలగొట్టించిన యాజమాన్యం... ఇద్దరు విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించింది. బాలికల హాస్టల్లోకి ప్రవేశిస్తుంటే... సెక్యూరిటీ సిబ్బంది నిద్రపోతుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ఒక్క సంఘటనే కాదు... క్యాంపస్‌లో ఇంకా చాలా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయిస్తే మరెన్నో నివ్వెరపోయే నిజాలు బయటకు వస్తాయని.. స్థానికులు అంటున్నారు.
ఇదీ చదవండి: