ETV Bharat / state

Blood scarcity: నిండుకున్న నిల్వలు.. రక్తదానానికి ముందుకు రాని దాతలు

బ్లడ్‌ బ్యాంకుల్లో నిల్వలు నిండుకున్నాయి. కరోనా కారణంగా రక్తదానానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ ప్రభావం తలసేమియా బాధితులపై గట్టిగానే పడింది. చాలా ఆస్పత్రుల్లో అత్యవసర శస్త్రచికిత్సలూ ఆగిపోయాయి. కరోనా తగ్గితేకానీ పరిస్థితులు మెరుగయ్యేలా లేవని వైద్యులు అంటున్నారు.

blood scarcity in andhrapradhesh about corona
నిండుకున్న నిల్వలు... రక్తదానానికి ముందుకు రాని దాతలు
author img

By

Published : Jun 12, 2021, 5:54 PM IST

నిండుకున్న నిల్వలు... రక్తదానానికి ముందుకు రాని దాతలు

కొవిడ్ వ్యాప్తితో రాష్ట్రంలో రక్త నిల్వలు భారీగా తగ్గాయి. గర్భిణులు, తలసేమియా బాధితులు రక్తం అందక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గతేడాది మార్చిలో వైరస్‌ కేసులు ప్రారంభమైనప్పటి నుంచి రక్త సేకరణ బాగా తగ్గింది. మళ్లీ నవంబర్‌లో నిల్వలు సాధారణ స్థితికి చేరాయి. ఈ ఏడాది మార్చి నుంచి తిరిగి ఆటంకాలు మొదలయ్యాయి. గతంలో మాదిరిగా రక్తనిధి కేంద్రాలకు స్వచ్ఛందంగా వచ్చే దాతలు తక్కువయ్యారు. అవసరమైనప్పుడు ఫోన్‌ చేస్తే వచ్చి రక్తాన్ని ఇచ్చేవాళ్లు అందుబాటులో లేకుండా పోయారని వైద్యులు అంటున్నారు. కరోనా బాధితులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగిటివ్‌ వచ్చిన 14 రోజుల తర్వాతే రక్తం ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి. టీకా వేసుకున్న వాళ్లు కూడా 14 రోజుల తర్వాత రక్తదానం చేయవచ్చని కేంద్రం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రభావం రక్త సేకరణపై పడింది.

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్లడ్‌ బ్యాంకులు 167 ఉండగా వీటిలో సుమారు 2 వేల యూనిట్ల రక్తపు నిల్వలు ఉన్నాయి. ఇవి ప్రస్తుత అవసరాలకు సరిపోవు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో 18 రక్తనిధి కేంద్రాలు పని చేస్తున్నాయి. వీటిలో నెలకు సగటున ఏడెనిమిది వేల యూనిట్ల రక్తం అందుబాటులో ఉండేది. మే చివరి నాటికి ఈ కేంద్రాల్లోనూ 457 ప్యాకెట్లే మిగిలాయి. అందులోనూ అరుదైన గ్రూపుల రక్తం లేదు. ప్రముఖుల జయంతి, వర్ధంతి, జన్మదినాల సందర్భంగా జరిగే రక్తదాన శిబిరాల హడావుడి తగ్గడం వల్ల నిల్వలు నిండుకున్నాయి. కొవిడ్‌ వల్ల రక్తదానం చేసేందుకు విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఉద్యోగులూ ముందుకు రావడం లేదని రెడ్‌క్రాస్‌ సొసైటీ చెబుతోంది. రక్తపు నిల్వలు లేక తలసేమియా, సికిల్‌సెల్‌ వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర శస్త్రచికిత్సలకు రక్తం దొరకడం లేదు. కృష్ణా జిల్లాలో ‘A’ గ్రూపు రక్తం కోసం తలసేమియా బాధితులు ఎదురుచూస్తున్నారు.

ఇవీచదవండి.

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 6,952 కరోనా కేసులు, 58 మరణాలు

Rape: 8 ఏళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం!

ఆ తెలుగు చిత్రంలో నటించట్లేదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.