ETV Bharat / state

రైతుల నేస్తాలు.. నల్లముక్కు కొంగలు..! - birds help in farmings news

ఆస్ట్రేలియా నుంచి వచ్చిన నల్లముక్కు కొంగలు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపలోని ఓ పొలంలో సందడి చేశాయి. సరిగ్గా వరి దమ్ము చేసే సమయంలోనే మాత్రమే వచ్చి పురుగులను తిని వెళ్లిపోతాయని రైతులు చెబుతున్నారు.

రైతుల నేస్తాలు.. నల్లముక్కు కొంగలు..!
రైతుల నేస్తాలు.. నల్లముక్కు కొంగలు..!
author img

By

Published : Jul 12, 2020, 7:35 AM IST

వరి వేసేందుకు దమ్ము చేస్తున్న పొలాల్లోకి పెద్ద ఎత్తున పొడుగాటి నల్ల ముక్కు కొంగలు(ఐబీస్‌) వచ్చి వాలిపోతాయి. పొలాల్లోని లద్దె పురుగులు, వేరు తొలిచే పురుగులను ఇవి తినేస్తాయి. పాములను కూడా చంపగలవు. సరిగ్గా దమ్ము చేసే సమయంలో మాత్రమే వచ్చి పురుగులను తిని వెళ్లిపోతాయని రైతులు చెబుతున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపలోని ఓ పొలంలో ఉండగా ఇవి ‘ఈనాడు - ఈటీవీ భారత్​’ కెమెరాకు చిక్కాయి. ఆస్ట్రేలియా నుంచి వచ్చే ఈ పక్షులు అటవీ ప్రాంతానికి దగ్గరగా బురద ఉన్న చోట ఉంటాయని కృష్ణా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ పి. వీరబ్రహ్మచారి తెలిపారు.

ఇదీ చూడండి..

సీతారాముల విగ్రహాలకు వానరం పాదాభివందనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.