ETV Bharat / state

BJP Leaders Fire On YSRCP: 'ఓటు బ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా ఏపీలో పాలన' - Vajpayee birth anniversary

BJP Leaders Fire On YSRCP: విజయవాడ భాజపా కార్యాలయంలో ఈ పార్టీ నాయకులు వాజ్‌పేయీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వాజ్​పేయీ చిత్రపటానికి పూలమాలలు వేసి సోము వీర్రాజు, సునీల్ దేవ్​ధర్ నివాళులర్పించారు.

vajpayee-birth-anniversary-celebrations-at-vijayawada-bjp-office
భాజపా కార్యాలయంలో వాజ్‌పేయీ జయంత్యుత్సవాలు
author img

By

Published : Dec 25, 2021, 1:58 PM IST

BJP Leaders Fire On YSRCP: వాజ్‌పేయీ జయంతి సందర్భంగా విజయవాడ భాజపా కార్యాలయంలో సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్​ఛార్జీ సునీల్ దేవ్‌ధర్‌ హాజరయ్యారు. వాజ్‌పేయీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాజ్‌పేయీ పరిపాలన విధానం.. నేటి పాలకులకు ఆదర్శనని సునీల్‌ దేవ్‌ధర్‌ తెలిపారు. మోదీ పాలనలో వర్సిటీలు, వైద్య కళాశాలలు చాలా వచ్చాయన్నారు.

Sunil Deodhar on YSRCP: ఏపీలో ఓటు బ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా పాలన సాగుతోందన్న సునీల్​ దేవ్​ధర్​.. హోంమంత్రి సుచరిత మతపరమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. వైకాపా నేతలు మాయమాటలు చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నారని సునీల్ దేవ్​ధర్ ఆరోపించారు. అలాగే బలవంతపు మతమార్పిడులను పాలకులే ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. హిందూ ఆలయాల ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారని.. ఏపీలో భాజపా అధికారంలోకి వస్తే మత మార్పిడులకు వ్యతిరేకంగా బిల్లు తీసుకువస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

Christmas Celebrations: పులివెందులలో సీఎం జగన్​ క్రిస్మస్​ ప్రార్థనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.