ETV Bharat / state

'కరోనా కేసులను దాచి ప్రభుత్వం మోసగిస్తోంది' - విజయవాడ నేటి వార్తలు

మాజీమంత్రి, తెదేపా నేత భూమా అఖిలప్రియ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను దాచి వైకాపా సర్కార్ ప్రజలను మభ్యపెడుతోందని ధ్వజమెత్తారు. మండలానికి ఒకటి చొప్పున రైతు ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Bhooma Akhila priya Fire on state Government inVijayawada
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై భూమా అఖిల ప్రియ ధ్వజం
author img

By

Published : Apr 28, 2020, 8:01 PM IST

కరోనా కేసులను దాచిపెడుతూ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని… మాజీమంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 300కు పైగా కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 3 రోజుల క్రితమే 100 కేసులు నమోదైనట్లు తమకు సమాచారం ఉందని… అయితే ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా 40 కేసులను మాత్రమే బయటపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుల వివరాలను వెల్లడించి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

కరోనాతో కలిసి జీవించాలని సీఎం చేసిన ప్రకటన... వ్యాప్తి నియంత్రణ సాధ్యం కాక చేతులెత్తేసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. రైతు ఉత్పత్తుల కొనుగోలుకు నియోజకవర్గానికి ఓ మార్కెట్ యార్డు సరికాదని పేర్కొన్నారు. మండలానికి ఒకటి చొప్పను రైతు ఉత్పత్తుల విక్రయాల మార్కెట్​ను ఏర్పాటు చేశాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి.

మన వద్ద పాజిటివిటీ రేటు తక్కువ: జవహర్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.