కృష్ణానది వరద ప్రవాహ ఉద్ధృతికి విజయవాడ బెరంపార్కు సమీపంలోని భవానీ ద్వీపం కకావికళమైంది. వారం రోజుల పాటు కొనసాగిన ప్రవాహం ధాటికి ద్వీపంలోని నిర్మాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున మట్టి, ఇసుక మేటలు వేసి ద్వీపం స్వరూపం మారిపోయింది. ప్రాథమిక అంచనా ప్రకారం 3 నుంచి 5 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సాధారణ పరిస్థితి తీసుకొచ్చి పర్యాటకులను అనుమతించేందుకు మరో నాలుగైదు రోజులు పట్టనుండగా... పూర్తి స్థాయి పునరుద్ధరణకు నెల రోజులపైనే పట్టే అవకాశం ఉంది. వరదల ధాటికి రూపం కోల్పోయిన భవానీ ద్వీపం తాజా పరిస్థితిని ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
మసకబారిన ద్వీపం... పునరుద్ధరణకు పట్టెను సమయం.... - BHAVANI_ISLAND
కృష్ణానది వరద ప్రవాహ ఉద్ధృతికి విజయవాడ బెరంపార్కు సమీపంలోని భవానీ ద్వీపం కకావికళమైంది. వారం రోజుల పాటు కొనసాగిన ప్రవాహం ధాటికి ద్వీపంలోని నిర్మాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
కృష్ణానది వరద ప్రవాహ ఉద్ధృతికి విజయవాడ బెరంపార్కు సమీపంలోని భవానీ ద్వీపం కకావికళమైంది. వారం రోజుల పాటు కొనసాగిన ప్రవాహం ధాటికి ద్వీపంలోని నిర్మాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున మట్టి, ఇసుక మేటలు వేసి ద్వీపం స్వరూపం మారిపోయింది. ప్రాథమిక అంచనా ప్రకారం 3 నుంచి 5 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సాధారణ పరిస్థితి తీసుకొచ్చి పర్యాటకులను అనుమతించేందుకు మరో నాలుగైదు రోజులు పట్టనుండగా... పూర్తి స్థాయి పునరుద్ధరణకు నెల రోజులపైనే పట్టే అవకాశం ఉంది. వరదల ధాటికి రూపం కోల్పోయిన భవానీ ద్వీపం తాజా పరిస్థితిని ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
k.veerachari, 9948047582
మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య అంత్యక్రియలు కడప జిల్లా ఒంటిమిట్టలో జరిగాయి. అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స కోసం హైదరాబాద్ వెళ్తూ మార్గమధ్యంలో గుండె పోటుతో మృతి చెందిన మాజీమంత్రి బ్రహ్మయ్య భౌతికకాయానికి తెదేపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఇతర పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఒంటిమిట్టలో ఆయన సతీమణి సరస్వతి సమాధి వద్దనే అంత్యక్రియలు నిర్వహించారు. కడపలోని స్వగృహం నుంచి ప్రత్యేక వాహనంలో అంతిమ యాత్రను నిర్వహించారు అక్కడినుంచి ప్రతి గ్రామం వద్ద ఆయన అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఒంటిమిట్టకు చేరుకున్న బ్రహ్మయ్య భౌతికకాయాన్ని చూడడానికి రాజంపేట నియోజకవర్గం లోని రాజంపేట, నందలూరు, ఒంటిమిట్ట, సిద్ధవటం, వీరబల్లితో పాటు గోపవరం మండలం నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. మాజీ మంత్రి కావడంతో ఆయన భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని భావించారు. కానీ ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అంత్యక్రియలు అభిమానులు, పార్టీ నాయకులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. తెదేపా నేత కళావెంకట్రావు, ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు తెదేపా నాయకులు యెద్దల సుబ్బరాయుడు, కొమరం వెంకట నరసయ్య, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొని ఘన నివాళులర్పించారు.
Body:మాజీమంత్రి బ్రహ్మయ్య కు అంతిమ వీడ్కోలు
Conclusion:కడప జిల్లా రాజంపేట