విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా బత్తిన శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు చేరువగా ఉండి రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గ్యాంగ్వార్పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్న ఆయన.. గంజాయి అక్రమ రవాణాను అరికడతామని స్పష్టంచేశారు.
సైబర్క్రైమ్ను నియంత్రించేందుకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందన్నారు. కమిషనరేట్ పరిధిలో నేరాలను తగ్గించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు.
ఇదీచదవండి.