ETV Bharat / state

Avanigadda MRO Building in Dilapidated Condition.. జగనన్న..! అవనిగడ్డ కొత్త ఎమ్మార్వో కార్యాలయం ప్రారంభానికి అడ్డేంటన్న?

Avanigadda Tehsildar Office in Dilapidated Condition: ఇది తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో నిర్మాణం చేసిన భవనమా...అయితే మేం రంగులు మాత్రమే వేస్తాం ఇది వైసీపీ నాయకుల తీరు. ఇదిగో ప్రారంభిస్తాం అదిగో ప్రారంభిస్తాం అంటూ కాలయాపన చేస్తూ.. ప్రారంభోత్సవ పనులు అటకెక్కించారు. కృష్ణ జిల్లా అవనిగడ్డలో నిర్మాణం పూర్తి చేస్తున్న తహశీల్దార్ కార్యాలయం నాలుగేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Avanigadda_Tehsildar_Office_in_Dilapidated_Condition

author img

By

Published : Aug 13, 2023, 5:24 PM IST

Avanigadda Tehsildar Office in Dilapidated Condition: ప్రజల సౌకర్యం కోసం నిర్మాణం చేసిన భవనమైనా సరే మేము ప్రారంభోత్సవం చేసేది లేదు కృష్ణ జిల్లా అవనిగడ్డలో వైసీపీ ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు ఇది. 1912 బ్రిటిష్‌ వారి హయంలో అవనిగడ్డలో తహశీల్దార్ కార్యాలయం నిర్మించారు. 110 ఏళ్లు పూర్తిచేసుకున్న ఆ భవనం శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపోతుందో తెలియక అధికారులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. వివిధ పనుల కోసం కార్యాలయానికి వెళ్లిన ప్రజలు కార్యాలయం పైకప్పు పెంకులు పడి గాయపడిన వారు ఎక్కుమంది ఉన్నారని స్థానికులు చెబుతున్నారు.

విశాఖలో ఐటీ రంగం వెలవెల.. భవనాలు ఖాళీ

Construction of Tehsildar Building in TDP Govt: తెలుగుదేశం హాయంలో 90 లక్షల రూపాయలతో నూతన తహశీల్దార్ భవన నిర్మాణం పూర్తి చేశారు. కార్యాలయం ప్రారంభించే సమయానికి ఎన్నికల కోడ్ రావటంతో ప్రారంభోత్సవం వాయిదా పడింది. వైసీపీ అధికారం లోకి వచ్చాక నూతన తహశీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించలేదు. ఇదిగో ప్రారంభిస్తున్నాం..అదిగో రంగులేస్తున్నాం అన్నట్టు అధికార పార్టీ నేతలు కాలయాపన చేస్తున్నారని స్థానిక ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఒక్క సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసిన భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వైసీపీ ప్రజా ప్రతినిధులకు మనస్సు రావడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

త్వరగా పీహెచ్​సీ భవనాలు నిర్మించండి సారూ.. అనారోగ్యంతో బాధపడుతున్నాం..

YCP Government is painting buildings: 2019లోనే పనులు పూర్తైన ఈ భవనానికి వైసీపీ వారు రంగులు మాత్రం వేశారని విపక్షాల నాయకులు మండిపడుతున్నారు. ఎవరు నిర్మాణం చేసినా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉందన్న సంగతి గుర్తు పెట్టుకోవాని సూచిస్తున్నారు. రానున్నది ఎన్నికల సమయమని ఎన్నికలకు సంబంధించిన అన్ని పనులు ఇక్కడి నుంచే జరుగుతాయని విపక్షాల నేతల చెబుతున్నారు. రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు వివిధ పనుల కోసం ఇక్కడికి వస్తుంటారని పాత భవనం కూలీ ఎవరిపైనైనా పడితే ఎవరు భాద్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.

Rythu Bharosa Centers : రైతు భరోసా కేంద్రాలను విస్మరించిన ప్రభుత్వం.. పునాదికే పరిమితమైన నిర్మాణాలు

Janasena Leaders Comments on YCP Government: ఉట్టికి ఎగరలేని వారు స్వర్గానికి ఎగురుతానంటున్నారని జనసేన నేతలు విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వంలో నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాన్ని ప్రారంభించడం చేతకానీ ఈ ప్రభుత్వం మూడు రాజధానులు నిర్మాణం చేస్తామని చెప్పడం హస్యస్పదంగా ఉందంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సచివాలయాల నిర్మాణం నత్తనడకన సాగుతుందని, పూర్తయిన ఎమ్ఆర్వో కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం ఎందుకు మీన మేషాలు లెక్కిస్తుందో ఆర్ధం కావడం లేదన్నారు. పాత భవనానికి పైకప్పు పాడైపోవడంతో చిన్నపాటి వర్షానికే పైల్స్ తడిచిపోతున్నాయని చెప్పారు. నాలుగేళ్లే క్రితమే నిర్మాణం పూర్తయిన భవనాన్ని కూడా ప్రారంభించకుండా కాలయాపన చేస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Avanigadda MRO Building జగనన్న..! అవనిగడ్డ కొత్త ఎమ్మార్వో కార్యాలయం ప్రారంభానికి అడ్డేంటన్న? ఎంఆర్వో ఆఫీస్ ఎప్పుడు..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.